Venkatesh Daggubati: ఇంతకాలానికి నిరీక్షణ ఫలించిందంటున్న ప్రియమణి!

Priyamani says that her dream was fulfilled
  • చెప్పుకోదగిన సినిమా 'యమదొంగ'
  • కన్నడ .. మలయాళ భాషల్లో బిజీ
  • 'నారప్ప'తో తెలుగులోకి రీ ఎంట్రీ
  • 'విరాటపర్వం'లోను మంచి పాత్ర
తెలుగు తెరను పలకరించిన సీనియర్ హీరోయిన్స్ లో ప్రియమణి ఒకరు. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ, వాటిలో 'యమదొంగ' సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఆ తరువాత ప్రియమణి చేసిన సినిమాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువకావడంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె కన్నడ .. మలయాళ సినిమాలపై దృష్టిపెట్టి, అక్కడ బాగానే బిజీ అయింది. కొంత గ్యాప్ తరువాత ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా 'నారప్ప' సినిమాలో ఆమె వెంకటేశ్ భార్య పాత్రలో నటించింది. ఈ పాత్రను గురించి తాజాగా ఆమె చెబుతూ.. " వెంకటేశ్ సరసన నటించాలనే కోరిక నాకు చాలాకాలం నుంచి ఉండేది. గతంలో ఆయన జోడీకట్టే అవకాశాలు వచ్చాయికానీ, చివరి నిమిషంలో చేజారిపోయాయి. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఇక 'విరాటపర్వం' సినిమాలోని భరతక్క పాత్రకి కూడా మంచి పేరు వస్తుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Venkatesh Daggubati
Priyamani
Narappa Movie

More Telugu News