హైదరాబాద్ వాసులకు తీపి కబురు.. పెరిగిన మెట్రో సమయం
- ఉదయం ఏడుగంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మెట్రో సేవలు
- ఉదయం 11.45 గంటలకు బయలుదేరనున్న చివరి రైలు
- సడలింపు సమయం ఒంటిగంట వరకు పెరిగిన నేపథ్యంలో నిర్ణయం
ఈ నేపథ్యంలో మెట్రో వేళల్లోనూ మార్పులు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచే రైళ్లు ప్రారంభమవుతాయని, 12.45 గంటలకు సేవలు ముగుస్తాయని హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఉదయం 11.45 గంటలకు అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు బయలుదేరుతుందని తెలిపింది.
అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఫేస్‌మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని, ఎప్పటికప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలని కోరింది. అలాగే, స్టేషన్లలోని భద్రతా సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.