Anandayya: ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు నివేదిక

Report to the Central Ayurvedic Research Institute on Anandayya medicine
  • ఆన్‌లైన్‌లో సమర్పించిన తిరుపతి, విజయవాడ ఆయుర్వేద పరిశోధన సంస్థలు
  • నివేదికను పరిశీలించి అభిప్రాయాన్ని వెల్లడించనున్న ఢిల్లీ సంస్థ
  • ఆనందయ్యను ఎందుకు నిర్బంధించారో చెప్పాలన్న ఆచారి
ఆనందయ్య కరోనా మందు పనితీరుపై అధ్యయనం చేసిన తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు అందుకు సంబంధించిన నివేదికను నిన్న ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థలు ఆన్‌లైన్‌లో సమర్పించాయి. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్ర పరిశోధన సంస్థ ఈ మందుపై తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది.

ఆనందయ్యను నిన్న తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఆనందయ్య నిర్బంధంపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తలోజి తీవ్రంగా స్పందించారు. ఆయనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కృష్ణపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆచారి..కుటుంబ సభ్యుల నుంచి ఆనందయ్యను దూరం చేయడం దారుణమన్నారు. ఆనందయ్య మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆనందయ్యను నిర్బంధించిన వారిపై బీసీ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
Anandayya
Corona Virus
Ayurveda Medicine
Krishnapatnam

More Telugu News