TTD: గుండెపోటుతో తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల పద్మనాభం యాదవ్ మృతి

TTD Golla Padmanabham Died with Heart Attack
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • వంశపారంపర్యంగా శ్రీవారి ఆలయ సన్నిధి గొల్లగా పనిచేస్తున్న పద్మనాభం
  • ఆలయ తలుపులు తెరవడం, మూయడం గొల్ల పనే
ప్రతి రోజూ తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే గొల్ల పద్మనాభం గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. రాత్రి గుండెపోటుతో విలవిల్లాడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే టీటీడీ అశ్విని ఆసుపత్రి ప్రాంగణంలోని అపోలో సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పద్మనాభానికి భార్య, పిల్లలు ఉన్నారు.

పద్మనాభం వంశపారంపర్యంగా ఆలయ సన్నిధి గొల్లగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ దివిటీ పట్టుకుని అర్చకులను ఆలయానికి తీసుకొస్తుంటారు. ఆలయ తలుపులు తెరవడం, మూయడం వంటివి ఈ సన్నిధి గొల్లలే చేస్తుండడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
TTD
Srivari Temple
Tirumala
TTD Golla

More Telugu News