China: చైనాలో మళ్లీ కరోనా... ఇది కొత్త వేరియంట్ అంటున్న అధికారులు

China witnesses new series of corona cases
  • గ్వాంగ్జౌ నగరంలో 20 కొత్త కేసులు
  • ఈ వేరియంట్ ప్రమాదకారి అంటున్న గ్లోబల్ టైమ్స్
  • లివాన్ జిల్లాలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు
  • బహిరంగ కార్యకలాపాలపై ఆంక్షలు
వ్యాక్సినేషన్ తప్ప ఎవరెంత చేసినా కరోనా కట్టడి కష్టసాధ్యమని తేలిపోయింది. లాక్ డౌన్లు, మాస్కులు, భౌతికదూరాలు తాత్కాలికమే తప్ప, దీర్ఘకాలంలో పనిచేయవని వెల్లడైంది. చైనాలో కరోనా వ్యాప్తి తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కఠినమైన రీతిలో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ సడలించగానే మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, గ్వాంగ్జౌ నగరంలో 20 కొత్త కేసులను గుర్తించారు. 20 పాజిటివ్ కేసులంటే పెద్ద విషయమేమీ కాకపోయినా, తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఇది కొత్త వేరియంట్ అని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. మునుపటి వేరియంట్లతో పోల్చితే దీని వల్ల అధిక ముప్పు ఉంటుందని చైనా అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, కొత్త వేరియంట్ ఉనికిని గుర్తించేందుకు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైందని భావిస్తున్న లివాన్ జిల్లాలో మార్కెట్లు, రెస్టారెంట్లు మూసివేశారు. బహిరంగ కార్యక్రమాలపైనా, సాంస్కృతిక కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు.
China
Guangzhou
Corona Virus
New Cases

More Telugu News