Balakrishna: బాలకృష్ణ సినిమాని వదులుకున్న రకుల్?

Rakul rejected to do in Balakrishna movie
  • బాలకృష్ణ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
  • దర్శకుడిగా గోపీచంద్ మలినేని
  • ఇద్దరు కథానాయికల అవసరం
  • శ్రుతి హాసన్ కి డేట్స్ సమస్య  
తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకి జోడీగా కాజల్ .. తమన్నా మాత్రమే కనిపిస్తున్నారు. క్రేజ్ పరంగా చూసుకుంటే ఈ ఇద్దరే ముందువరుసలో కనిపిస్తున్నారు. దాంతో ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తదుపరి సినిమాకి హీరోయిన్లు దొరకడం సమస్యగా మారింది. బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ 'సలార్' సినిమా కారణంగా డేట్లు కుదరడం లేదని ఆమె చెప్పిందట. ఈ నేపథ్యంలోనే రకుల్ ను సంప్రదించగా, హిందీ ప్రాజెక్టుల కారణంగా తాను బిజీగా ఉన్నానని అందట. దాంతో ఇక ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో తర్జన భర్జనలు పడుతున్నారట. అసలే ఇద్దరు కథానాయికలు అవసరమని అంటున్నారు. గోపీచంద్ మలినేని ఎవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి మరి.
Balakrishna
Gopichand Malineni
Rakul Preet Singh

More Telugu News