దేశ ప్రధాని అంటే ఓ వ్యవస్థ... అలాంటి వ్యవస్థను అవమానించారు: మమతపై పురందేశ్వరి ఆగ్రహం
- నిన్న బెంగాల్ లో మోదీ ఏరియల్ సర్వే
- యాస్ తుపాను నష్టంపై పరిశీలన
- సమీక్ష సమావేశం చేపట్టిన మోదీ
- మమత ఆలస్యంగా వచ్చారంటూ బీజేపీ ఫైర్
"యాస్ సైక్లోన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని బెంగాల్ కు వస్తే, ఆయనను 30 నిమిషాల పాటు మీకోసం వేచిచూసేలా చేశారు. పైగా సమీక్ష సమావేశం పూర్తికాక ముందే వెళ్లిపోయారు. తద్వారా ఆ వ్యవస్థను కించపరిచారు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.