కరోనా కొన్ని తరాల పాటు మనతోనే ఉంటుంది: ఐపీహెచ్ డైరెక్టర్ జీవీఎస్ మూర్తి
- గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా చొచ్చుకుపోయిందన్న మూర్తి
- అంటువ్యాధుల్లో ఇది సహజమేనని వెల్లడి
- సాధారణ ఫ్లూ మాదిరే కరోనా మారిపోతుందని వ్యాఖ్యలు
- నవంబరులో కరోనా థర్డ్ వేవ్!
కాగా, భారత్ లో నవంబరులో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, 30 ఏళ్లకు పైబడినవారిలో 80 శాతం మందికి టీకాలు ఇస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని అన్నారు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దేశంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు జరపడం వల్లే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా పరిణమించిందని అభిప్రాయపడ్డారు.
భారత్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సెకండ్ వేవ్ సంకేతాలు వెలువడ్డాయని, కానీ, ప్రజారోగ్య వ్యవస్థ సరైన రీతిలో స్పందించలేదని వెల్లడించారు. ఇతర దేశాల్లో ప్రజారోగ్య వ్యవస్థలు స్పందిస్తుంటే, దురదృష్టం కొద్దీ మనదేశంలో రాజకీయ ప్రతిస్పందనలే వినిపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.