Pavan Kalyan: పవన్ కోసం మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్!

Flash back episode in Pavan Kalyan remake movie
  • మలయాళ రీమేక్ లో పవన్
  • మరో ప్రధానమైన పాత్రలో రానా
  • దర్శకుడిగా సాగర్ కె చంద్ర
మలయాళంలో క్రితం ఏడాదిలో విడుదలైన సినిమాలలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, పవన్ - రానా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు.

ఇక మలయాళంలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ సినిమాలో పెడుతున్నారట. పవన్ క్రేజ్ కి తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆయన పాత్రకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను క్రియేట్ చేయడం అన్నది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో  చూడాలి.
Pavan Kalyan
Rana
Ayyappanum Koshiyum Movie Remake

More Telugu News