Rakul Preet Singh: రకుల్ డీలాపడిపోయిందట!

Rakul felt low for Sardar ka Grandson movie
  • తెలుగులో తగ్గిన జోరు
  • తమిళంలోను అదే పరిస్థితి
  • హిందీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు  

తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిన్న మొన్నటి వరకూ రకుల్ ఒక వెలుగు వెలిగింది. కానీ హఠాత్తుగా ఆమె గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలను చుట్టబెట్టిన ఆమెకి ఇప్పుడు ఇక్కడ చెప్పుకోదగిన అవకాశాలు లేవు.

 తమిళంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినట్టుగా ఆమె హిందీలో తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చింది. ఆ ప్రయత్నాలు కొంతవరకూ ఫలించాయి కూడా. హిందీలో ఆమె 'సర్దార్ కా గ్రాండ్ సన్' .. 'ఎటాక్' .. 'మే డే' సినిమాలు చేసింది. ఈ మూడింటిలో మొదటి సినిమా రకుల్ ని నిరాశపరిచిందని అంటున్నారు.

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడటం వలన, 'సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై రకుల్ భారీగానే ఆశలు పెట్టుకుందట. కానీ ఓటీటీలో ఆశించిన స్థాయిలో వ్యూయర్ షిప్ ను దక్కించుకోలేకపోయిందని అంటున్నారు. తన పాత్రకి అనుకున్నంత గుర్తింపు రాకపోవడం రకుల్ ను మరింతగా బాధపెడుతోందట. మరో రెండు సినిమాలు ఉన్నాయి కనుక, అవి తన కెరియర్ కి హెల్ప్ అయితే చాలని అనుకుంటోందట. ఆమె కోరిక ఎంతవరకూ నెరవేరుతుందో ఏమో!

  • Loading...

More Telugu News