Anandaiah: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం!

AP High Court orders state govt to file counter in Anandaiah medicine case
  • ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేయించుకోలేదన్న ప్రభుత్వం
  • మందును లోకాయుక్త ఎలా ఆపుతుందన్న ఆనందయ్య న్యాయవాది
  • తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
కరోనాకు నాటు వైద్యాన్ని అందిస్తున్న ఆనందయ్య అంశంపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... ఆనందయ్య తన మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకోలేదని తెలిపారు. ఆనందయ్య మందుపై పరీక్షల నివేదికలు ఈ నెల 29న వస్తాయని చెప్పారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ... ఆనందయ్య మందు కోసం ఎంతో మంది ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని... వీలైనంత త్వరగా నివేదికలు అందజేయాలని సూచించింది.

ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్ వాదిస్తూ... ఆయన మందును ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన మందును ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Anandaiah
Corona Medicine
AP High Court

More Telugu News