డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ.. అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు
- పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు
- అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ
- ఈ నెల 25న అంటిగ్వా నుంచి పరార్
- అటునుంచి అటే భారత్కు పంపించాలన్న అంటిగ్వా ప్రధాని
మరోవైపు, చోక్సీ దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదని ఆ దేశ ప్రధాని కూడా చెప్పారు. అయితే, తాజాగా చోక్సీ డొమినికా పోలీసులకు చిక్కినట్టు అక్కడి మీడియా తెలిపింది. అతడిని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, చోక్సీ సముద్రమార్గం ద్వారా అక్రమంగా డొమినికాకు వెళ్లి ఉండొచ్చని అంటిగ్వా ప్రధాని తెలిపారు. చోక్సీని నిర్బంధించి అటు నుంచి అటే అతడిని భారత్కు తరలించాలని అంటిగ్వా ప్రధాని డొమినికాను కోరారు.