Bhopal: ఆహారం ఇస్తామని చెప్పి.. అంబులెన్సులో గ్యాంగ్ రేప్ చేశారు

22 years woman gang raped in Ambulance
  • భోపాల్ లో దారుణ ఘటన
  • 22 ఏళ్ల యువతిపై డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారం
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఓ యువతిపై అంబులెన్స్ డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆహారం ఇస్తామని ఆశచూపి ఆమెను అంబులెన్స్ లోకి తీసుకెళ్లి ఘోరానికి పాల్పడినట్టు పోలీసు అధికారి సురేంద్ర పంచోలి తెలిపారు. ఈ ఘటన సోమవారం జరిగిందని చెప్పారు. అత్యాచారానికి గురైన మహిళ వివాహిత అని చెప్పారు.

ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్)తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్ ని, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించామని చెప్పారు.
Bhopal
Gang Rape
Ambulance

More Telugu News