క్షణంలో తప్పిన భారీ ప్రమాదం.. నడిరోడ్డుపై కూలిన వాటర్ ట్యాంకర్

  • ఉన్నట్టుండి కుప్పకూలిన భారీ వాటర్ ట్యాంకర్
  • క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకున్న బైకర్లు
  • మధ్యప్రదేశ్‌, డాటియా జిల్లా పీతాంబరలో ఘటన  
క్షణాల విలువేంటో తెలిసేది ఇలాంటప్పుడే. రోడ్డుపక్కనున్న ఓ భారీ ట్యాంకర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. అదే సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు క్షణకాలంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు చూస్తుండగానే ఆ భారీ ట్యాంకర్ కుప్పకూలింది. అది తమపై పడబోతోందని గ్రహించిన బైకర్లలో ఒకరు అతి వేగంతో వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకోగా, మరో వ్యక్తి మాత్రం బైక్‌ను అక్కడే పడేసి పరుగులంకించుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో జరిగిందీ ఘటన. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడం వల్లే ట్యాంకర్ కూలిందని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.


More Telugu News

Madhya Pradesh Water Tanker Viral Videos