ఆనందయ్య భార్యను సన్మానించిన టీడీపీ నేతలు... వీడియో ఇదిగో!
- విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఆనందయ్య మందు
- మందు పంపిణీని నిలిపివేసిన సర్కారు
- మందుపై కొనసాగుతున్న అధ్యయనం
- కృష్ణపట్నంలో పర్యటించిన టీడీపీ బృందం
అంతకుముందు టీడీపీ నేతలు ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. అదే సమయంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఓ విద్యార్థి తీవ్ర అస్వస్థతతో అక్కడికి రాగా, సోమిరెడ్డి సమక్షంలోనే ఆనందయ్య కుటుంబ సభ్యులు ఆ విద్యార్థి కంట్లో చుక్కలు వేశారు. దాంతో కొద్దిసేపటికే ఆ విద్యార్థి లేచి కూర్చున్నాడు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, ఆనందయ్య మందును ఎందుకు ఆపారో తెలియదు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నారు అంటున్నారని విమర్శించారు. ఈ మందును కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాము మందుపై అధ్యయనం చేయవద్దనడంలేదని, మందును ఆపవద్దంటున్నామని స్పష్టం చేశారు.