Mia Khalifa: పాకిస్థాన్ పై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా మండిపాటు

Ex port star Mia Khalifa fires on Pakistan
  • మియా ఖలీఫా టిక్ టాక్ అకౌంట్ ను ఆపేసిన పాకిస్థాన్
  • తనకు నోటీసు కూడా ఇవ్వలేదని ఖలీఫా ఫైర్
  • అన్ని వీడియోలు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తానని వ్యాఖ్య
మాజీ పోర్న్ స్టార్, అమెరికన్ మోడల్ మియా ఖలీఫా మరోసారి వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆమె మండిపడింది. అసలేం జరిగిందంటే... మియా ఖలీఫా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. టిక్ టాక్ లో అయితే ఆమె మరింతగా సందడి చేస్తుంది. అయితే ఆమె టిక్ టాక్ అకౌంట్ ను పాకిస్థాన్ లో నిలిపేశారు. కంటెంట్ సెన్సార్ షిప్ కింద అకౌంట్ ను బ్యాన్ చేశారు.

దీనిపై మియా ఖలీఫా స్పందిస్తూ... తన అకౌంట్ ను ఆపేస్తున్నట్టు తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని మండిపడింది. తన ఖాతాను ఆపేసినందుకు పాకిస్థాన్ కు అభినందనలను తెలుపుతున్నానని ఎద్దేవా చేసింది. పాకిస్థాన్ లోని తన అభిమానులెవరూ చింతించాల్సిన అవసరం లేదని... తన వీడియోలన్నింటినీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తానని తెలిపింది. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Mia Khalifa
Porn Star
Pakistan
TikTok

More Telugu News