Vaccination: తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్... సర్కారు ఆమోదం

Telangana govt gives nod to vaccinate for eighteen years plus people
  • ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
  • ఆఫీసులు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వ్యాక్సిన్
  • దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్
  • అనేక రాష్ట్రాల్లో టీకాల కొరత
  • 45 ఏళ్లకు పైబడినవారికే చాలాచోట్ల ప్రాధాన్యత
తెలంగాణలో ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలే కొనసాగుతున్నాయి.
Vaccination
18+
Telangana
Corona Virus
CoWin

More Telugu News