Raghu Rama Krishna Raju: గుంటూరు జిల్లా కోర్టుకు చేరుకున్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు న్యాయ‌వాదులు.. ఈరోజు బెయిలుపై విడుద‌ల‌య్యే అవ‌కాశం

raghu rama to be released today
  • రఘురామకు ఇప్ప‌టికే ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు
  • వ్యక్తిగత పూచీకత్తును స‌మ‌ర్పిస్తోన్న న్యాయ‌వాదులు
  • మెజిస్ట్రేట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ తర్వాత ఆదేశాలు ఆర్మీ ఆసుప‌త్రికి
  • ఆసుప‌త్రి నుంచి నేరుగా విడుద‌ల‌య్యే అవ‌కాశం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ర‌ఘురామ ఈ రోజు ఆసుప‌త్రి నుంచే నేరుగా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయన తరఫు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు చేరుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తును వారు సమర్పిస్తున్నారు. మెజిస్ట్రేట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ తర్వాత ఆదేశాలు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రికి చేర‌తాయి.

అక్క‌డి నుంచి నేరుగా రఘురామ కృష్ణ‌రాజును విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. కాగా, బెయిల్ కోసం రఘురామ రూ.లక్ష పూచీకత్తు చెల్లించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అలాగే, కేసు గురించి మీడియాతోగానీ, సోష‌ల్ మీడియాలో గానీ మాట్లాడ‌వ‌ద్ద‌ని ష‌ర‌తు విధించింది.
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh

More Telugu News