Ali: టాలీవుడ్ మహిళా కార్మికులకు కమెడియన్ అలీ దంపతుల సాయం

Tollywood comedian Ali and his wife distributes essentials to women production union members
  • కరోనా కారణంగా నిలిచిన సినీ కార్యకలాపాలు
  • ఉపాధి లేక అలమటిస్తున్న కార్మికులు
  • ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ సభ్యులకు అలీ వితరణ
  • రూ.2 లక్షల వ్యయంతో నిత్యావసరాల అందజేత

కరోనా సెకండ్ వేవ్ తో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ స్తంభించిపోయింది. దాంతో 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ కమెడియన్ అలీ, జుబేదా దంపతులు ఇవాళ టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, చక్కెర, మరో 8 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం రూ.2 లక్షల వ్యయంతో 130 మందికి సాయం చేసినట్టు అలీ తెలిపారు.

ఈ మహిళా కార్మికులు తమకంటే ముందే షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. కరోనా కారణంగా పని లేక వారు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా స్పందించానని అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు ఖయ్యూం తదితరులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News