Vijayashanti: ఎన్నికలు ఉంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేయాల్సిన పనులు గుర్తుకు రావు: విజయశాంతి

Vijayasanthi slams TRS govt
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు
  • ఇప్పటికీ రుణమాఫీ పూర్తికాలేదని వ్యాఖ్యలు
  • ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
  • రేపు రైతు గోస చేపట్టాలని నిర్ణయం
టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేయాల్సిన పనులు గుర్తుకురావని విమర్శించారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా సగం కూడా రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనితీరాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించవద్దని తెలిపారు. తెలంగాణ రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 'తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష' చేపట్టాలని నిర్ణయించినట్టు విజయశాంతి వెల్లడించారు.
Vijayashanti
TRS
KCR
Farmers
Telangana

More Telugu News