ఒక్క కరోనా కేసు గుర్తిస్తే, అప్పటికి 27 మందికి కరోనా సోకినట్టే భావించాలి: ఐసీఎంఆర్
- దేశంలో ఇప్పటివరకు 24.1 శాతం మందికి కరోనా
- ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం మందికి పాజిటివ్
- 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో సెరో సర్వే
- పదేళ్లకు పైబడినవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
10 ఏళ్లకు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని వివరించింది. 10 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం 400 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిలు నిర్వహించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. అటు, 25.6 శాతం ఆరోగ్య సిబ్బంది కొవిడ్ బారినపడినట్టు వెల్లడైందని తెలిపింది. ఆరోగ్య సిబ్బందిలో 100 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లోనే ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్నారని వెల్లడించింది.