తెలంగాణలో నెమ్మదిస్తున్న కరోనా వ్యాప్తి

  • గత 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు
  • 3,464 పాజిటివ్ కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 534 మందికి కరోనా
  • కరోనా నుంచి కోలుకున్న 4,801 మంది
  • ఇంకా 44,395 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 534 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 219, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,801 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులవగా, 25 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,47,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,00,247 మంది కోలుకున్నారు. ఇంకా 44,395 మందికి చికిత్స జరుగుతోంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.33 శాతంగా నమోదైంది. జాతీయస్థాయి రికవరీ రేటు 87.2 శాతం అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.

Corona Virus
Positive Cases
Telangana
New Cases

More Telugu News