Manchu Manoj: 25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు సాయం చేయాలని మంచు మనోజ్ నిర్ణయం

Manchu Manoj decides to distribute essentials on his birthday
  • రేపు మంచు మనోజ్ పుట్టినరోజు
  • కీలక నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్
  • అభిమానులు, మిత్రులతో కలిసి సామాజిక సేవ
  • కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తామని వెల్లడి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మే 20న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మంచు మనోజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అభిమానులు, మిత్రులతో కలిసి 25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని మనోజ్ తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ తమ కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరిస్తూ, తరచుగా శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకుందామని పేర్కొన్నారు.
Manchu Manoj
Birthday
Distribution
Essentials
Covid Families

More Telugu News