సీఎం గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు: విజయశాంతి
- ఆయుష్మాన్ భారత్ లో చేరిన తెలంగాణ
- కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న బీజేపీ నేతలు
- ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
- బీజేపీ నేతల డిమాండ్ కు దిగొచ్చారంటూ విజయశాంతి వ్యాఖ్యలు
ఓవైపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, జల ప్రాజెక్టుల కమిషన్లు ఉండగానే... టీఆర్ఎస్ దొరల అనుచర బంధుగణం మెడికల్ మాఫియా అవతారం ఎత్తిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ తోపాటు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 5 లక్షల వ్యాక్సిన్ డోసుల నిల్వ లెక్క తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. లేకపోతే ఇది టీఆర్ఎస్ బ్లాక్ మార్కెట్ కుంభకోణం అని భావించాల్సి ఉంటుందని తెలిపారు.