జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య పరీక్షల నివేదిక
- గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు
- కొద్దిసేపటి కిందట జిల్లా కోర్టుకు రిపోర్టు సమర్పణ
- ప్రత్యేక మెసెంజర్ ద్వారా ఆ రిపోర్టును హైకోర్టుకు పంపిన జిల్లా కోర్టు
- కాసేపట్లో హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం
అంతకుముందు, జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికపై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.