Revanth Reddy: లాక్‌డౌన్‌లో హైద‌రాబాద్‌లో బ‌య‌ట‌ తిరుగుతున్నార‌ని రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వీడియో ఇదిగో

bitter experience for revant reddy in hyderabad
  • బేగంపేట‌లో ఘ‌ట‌న‌
  • ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌న్న పోలీసులు
  • తాను కంటోన్మెంట్ ఆసుప‌త్రికి జ‌న‌రేట‌ర్ ఇచ్చేందుకు వెళుతున్నాన‌న్న రేవంత్
  • అయిన‌ప్ప‌టికీ అనుమ‌తి లేదన్న‌ పోలీసులు  
హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బేగంపేట‌లో రేవంత్ రెడ్డి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ను అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని చెప్పారు.

అయితే, తాను కంటోన్మెంట్ ఆసుప‌త్రికి జ‌న‌రేట‌ర్ ఇచ్చేందుకు వెళుతున్నాన‌ని పోలీసుల‌కు రేవంత్ రెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ స‌మ‌యంలో తిరిగేందుకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వాదించారు. తాను సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే త‌న బండిని రోడ్డు మీదే ఆపేయ‌డ‌మేంట‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. దీంతో పోలీసు ఉన్న‌తాధికారుల‌తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.

Revanth Reddy
Congress
Lockdown
Hyderabad

More Telugu News