దేశంలోనే తొలిసారిగా అసోంలో హిజ్రాలకు కరోనా వ్యాక్సినేషన్
- గువాహాటీలో ప్రారంభం
- ఓ ఆశ్రమంలో 30 మందికి టీకాలు
- ప్రస్తుతం గువాహాటీకే పరిమితం
- త్వరలోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లందరికీ
ఉపాంత పరిస్థితుల్లో బతికే హిజ్రాలకు కరోనా వ్యాక్సిన్లు అందని పరిస్థితి ఉందని, దీనిపై ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేస్తే స్పందించి తమకు వ్యాక్సిన్లు వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కేవలం గువాహాటీకే ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిమితమైందని, తొందర్లోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అసోంలో 20 వేల మంది దాకా హిజ్రాలున్నట్టు అంచనా.