'విరాటపర్వం' విడుదలపై ఆలోచన!

Confusion on Virataparvam release
రానా .. సాయిపల్లవి కాంబినేషన్లో 'విరాటపర్వం' రూపొందింది. ఆశలకు .. ఆశయాలకు మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఒకవైపున ఉద్యమం .. మరో వైపున భావోద్వేగం .. ఈ రెండింటి మధ్య నడిచే ఆసక్తికరమైన కథ ఇది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను క్రితం నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా పూర్తయ్యాయి. అయితే కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకున్న సినిమాల జాబితాలో 'విరాటపర్వం' కూడా చేరిపోయింది.

అలా వాయిదాపడిన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సురేశ్ బాబు ఆలోచన చేస్తున్నారటగానీ ఇంకా నిర్ణయమైతే తీసుకోలేదని అంటున్నారు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అనంతరం డిజిటల్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు అడుగుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు నేరుగా డిజిటల్ హక్కులు ఇవ్వాలనుకుంటే ఈ లెక్కలు వేరుగా ఉంటాయి. అందువలన మంచి ఆఫర్ వస్తే చూద్దాం అనే ఉద్దేశంతో సురేశ్ బాబు ఉన్నారని అంటున్నారు. మరి 'విరాటపర్వం' థియేటర్లు తెరుచుకునేవరకూ వెయిట్ చేస్తుందా? లేదంటే డిజిటల్ బాట పడుతుందా? అనేది చూడాలి.
Go Back to Shorts
Rana Daggubati
Sai Pallavi
Venu Udugula

More Telugu News