Balakrihna: బాలయ్య భార్య పాత్రలో పూర్ణ!

Poorna is playing as a wife role for Balakrishna in Akhanda movie
  • విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూర్ణ
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్  
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రైతు పాత్రలోనూ ... అఘోర పాత్రలోను కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ప్రగ్యా జైస్వాల్ ను .. పూర్ణను కథానాయికలుగా తీనుకున్నారు. ప్రగ్యా జైస్వాల్ ను బాలయ్య సరసన ఆడిపాడటానికి తీసుకుని ఉంటారు. మరి పూర్ణ పాత్ర ఏమిటి? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఈ సినిమాలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ సినిమాలో పూర్ణ పాత్ర నిడివి చిన్నదే అయినా, బాలకృష్ణ భార్య పాత్ర కావడం వలన .. ఆయనతో తొలిసారిగా వచ్చిన అవకాశం కావడం వలన ఆమె అంగీకరించిందని అంటున్నారు. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో పూర్ణ కనిపిస్తుందట. సెకండాఫ్ లో వచ్చే పూర్ణ పాత్ర చాలా బాగుంటుందనీ .. ఆమెకి మంచి పేరు తెస్తుందని చెబుతున్నారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Balakrihna
Pragya Jaiswal
Poorna

More Telugu News