భారత్ బయోటెక్ చిన్నారుల కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ పచ్చజెండా
- ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికే వ్యాక్సిన్
- చిన్నారులకు వ్యాక్సిన్ పై దరఖాస్తు చేసుకున్న భారత్ బయోటెక్
- నిపుణుల సిఫారసులకు ఆమోదం తెలిపిన డీసీజీఐ
- 2,3వ దశ క్లినికల్ పరీక్షలకు అనుమతి
డీసీజీఐ అనుమతి నేపథ్యంలో చిన్నారుల కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సన్నద్ధమవుతోంది. అయితే, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలంటే, రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను భారత్ బయోటెక్ వర్గాలు కేంద్ర ఔషధాల ప్రమాణ స్థాయి సంస్థ (సీడీఎస్ సీఓ)కు సమర్పించాల్సి ఉంటుందని డీసీజీఐ స్పష్టం చేసింది.