ఆక్సిజన్ అవసరం మాకు తగ్గింది.. మిగులును వేరే రాష్ట్రాలకు ఇవ్వండి: కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ
- కేంద్రానికి లేఖ రాశామన్న డిప్యూటీ సీఎం
- రోజువారీ అవసరం 582 టన్నులకు తగ్గిందని వెల్లడి
- ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని కామెంట్
- ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు
ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నారు. తమకు 582 టన్నులు కేటాయించి మిగతా మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిందిగా కోరామని చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ హైకోర్టుకు సిసోడియా కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో నిన్న 10,400 కొత్త కేసులే నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతకుముందు రోజుతో పోలిస్తే 21 శాతం మేర తగ్గాయన్నారు. పాజిటివిటీ రేటు కూడా 14 శాతానికి పడిపోయిందన్నారు.