East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

Gang rape on young girl in East Godavari District
  • రెండు వారాల క్రితం ఘటన
  • స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై లైంగిక దాడి
  • ఫొటోలు తీసి బెదిరింపు
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో కలిసి సముద్రతీరానికి వచ్చిన ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి  రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది.

ఈ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం ఒడ్డుకు వెళ్లింది. అప్పటికే అక్కడ సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం తాగిన మత్తులో ఉన్నారు. అలాగే సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. యువతీయువకులను చూసిన ఈ ముగ్గురూ వారిని సమీపించి యువకుడిపై దాడిచేసి బంధించారు.

అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి నగ్న ఫొటోలను తీసి వదిలిపెట్టారు. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే తన వద్ద వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
East Godavari District
Gang Rape
Crime News

More Telugu News