Teegala Krishna Reddy: మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు

Police fines Teegala Krishna Reddy for not wearing mask
  • మాస్కు లేకుండా కారులో వెళ్తున్న తీగల
  • కర్మాన్ ఘాట్ వద్ద కారును ఆపిన పోలీసులు
  • తీగలకు రూ. వెయ్యి జరిమానా విధింపు

హైదరాబాద్ నగర మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మాస్కు లేకుండా కారులో వెళ్తున్న ఆయనకు సరూర్ నగర్ పోలీసులు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే, కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద తీగల వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాస్కు ధరించని తీగలకు రూ. 1000 జరిమానా విధిస్తూ, చలానా అందించారు. ఈ క్రమంలో తీగలకు, ఎస్సై ముఖేశ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, తమకు అందరూ సమానమేనని... కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నామని ఎస్సై చెప్పారు.

  • Loading...

More Telugu News