Balakrishna: బాలయ్య కోసం రెడీ చేసిన కథ మామూలుగా ఉండదట!

Anil Ravipudi upcoming movie with Balakrishna with powerful story
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ సినిమా అంటే మాస్ అంశాలు పుష్కలంగా ఉండాలి. పవర్ఫుల్ డైలాగులు .. పసందైన పాటలు .. హుషారెత్తించే ఫైట్స్ ఉండాలి. ముఖ్యంగా సినిమా భారీతనంతో సందడి చేయాలి. బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటే, ఆ కథలో ఇవన్నీ ఉంటేనే రంగంలోకి దిగవలసి ఉంటుంది. ఆయన కోసం తాను రెడీ చేసిన కథలో ఈ అంశాలన్నీ ఉన్నాయని అనిల్ రావిపూడి చెబుతున్నాడు. బాలకృష్ణ క్రేజ్ కి తగినట్టుగానే కథను చాలా పట్టుగా .. పవర్ఫుల్ గా అల్లుకున్నానని అంటున్నాడు. 'పటాస్' తరహా వినోదంతోనే ఈ సినిమా నిర్మితమవుతుందని చెప్పాడు.

ప్ర్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరగొచ్చని అంటున్నారు. ఆ తరువాతనే అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. ఈ లోగా 'ఎఫ్ 3'తో పాటు మహేశ్ బాబుతో సినిమాను కూడా అనిల్ రావిపూడి పూర్తిచేస్తాడన్న మాట.
Go Back to Shorts
Balakrishna
Anil Ravipudi
Gopichand Malineni

More Telugu News