కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరొచ్చు: కేంద్రం స్పష్టీకరణ
- ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న పలు రాష్ట్రాలు!
- గుర్తింపు కార్డు లేకపోయినా చేర్చుకోవాలన్న కేంద్రం
- ఏ ఆసుపత్రి నిరాకరించకూడదని వెల్లడి
- సుప్రీంకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు
కొవిడ్ నిర్ధారణ అయిన, కొవిడ్ అనుమానితుల అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా, దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.