Vellampalli Srinivasa Rao: ముస్లింలకు రంజాన్ తోఫా... 400 మందికి కానుకలు అందజేసిన మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli distributes Ramadan Tohfa
  • ఈ నెల 14న రంజాన్
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమం
  • హాజరైన ఏపీ దేవాదాయశాఖ మంత్రి
  • 8 రకాల సరుకులతో కూడిన కానుకల పంపిణీ
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ నెల 14న రంజాన్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో, విజయవాడ ప‌శ్చిమ‌ నియోజ‌కవ‌ర్గం భ‌వానీపురం ష‌హాబ్ ద‌ర్గా వద్ద ముస్లింలకు రంజాన్‌ తోఫా పేరిట కానుకలు పంపిణీ చేశారు. ఎ.కె ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో  8 రకాల సరుకులతో కూడిన ఈ కానుకలను దాదాపు 400 మంది ముస్లింలకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, భక్తి విశ్వాసాలకు ప్రతీక రంజాన్ పండగ అని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రంజాన్‌ పండుగను పేదలు కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో రంజాన్‌ తోఫా అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వా‌హ‌కులు అబ్దుల్ స‌త్తార్‌, అబ్దుల్ క‌లీమ్‌, అబ్దుల్ ర‌హమాన్‌, 41వ డివిజ‌న్ వైసీపీ నాయ‌కులు, స్థానిక కార్పొరేట‌ర్‌ మహమ్మ‌ద్ ఇర్ఫాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు
Vellampalli Srinivasa Rao
Ramadan Tohfa
Vijayawada
AK Foundation
YSRCP
Andhra Pradesh

More Telugu News