Singer Sunitha: కుటుంబ రక్షణలో భాగంగా ఇంటికే పరిమితమయ్యాను: సింగర్ సునీత

Staying at home due to corona situation says Singer Sunitha
  • కరోనా నేపథ్యంలో షూటింగులకు వెళ్లడం లేదు
  • ప్రతి రోజు రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వస్తాను
  • అవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దు
కరోనా వైరస్ వల్ల తాను షూటింగ్స్, రికార్డింగులకు కూడా వెళ్లడం లేదని సింగర్ సునీత తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని చెప్పారు. అయితే, కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు లైవ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వస్తున్నానని తెలిపారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని అభిమానులను కోరారు. లైవ్ లో తెలుగు, కన్నడ, తమిళం పాటలను ఆమె ఆలపించారు.

ఇదే సందర్భంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఆమె మాట్లాడుతూ, ఆయన పాటలోనే జీవించారని కొనియాడారు. ప్రతి పాట గురించి ఆయనకు గుర్తుండేదని చెప్పారు. గాయని చిత్ర దేశంలోనే గొప్ప సింగర్ అని కితాబునిచ్చారు. ఇకపై ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి అరగంట సేపు లైవ్ లోకి వస్తానని చెప్పారు. అభిమానులు కోరిన పాటలను పాడి వినిపిస్తానని తెలిపారు.
Singer Sunitha
Tollywood

More Telugu News