Jagan: కడప జిల్లాలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan shocks after huge blast in Kadapa district
  • ముగ్గురాయి గనిలో పేలుడు
  • జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది దుర్మరణం
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
కడప జిల్లా మామిళ్లపల్లెలో ఓ ముగ్గురాయి గని వద్ద పేలుడు జరిగి 10 మంది మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆయన అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలసపాడు మండలం మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ ను కిందికి దింపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి వాహనం తుత్తునియలు అయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి.
Jagan
Blast
Mines
Kadapa District

More Telugu News