Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు కరోనా పాజిటివ్!

Actor Kangana Ranaut says she has tested positive Corona
  • కొన్ని రోజులుగా కళ్లలో మంట, అలసటగా ఉంది
  • టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది
  • కరోనాకు భయపడితే.. అది మరింత భయపెడుతుంది
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తన కళ్లు కొద్దిగా మండుతున్నాయని, చాలా అలసటగా, వీక్ గా అనిపించిందని ఆమె చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ వెళ్లే ఆలోచనలో తాను నిన్న కోవిడ్ టెస్టులు చేయించుకున్నానని... టెస్టు రిపోర్టులు ఈరోజు వచ్చాయని, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు.

కరోనా వైరస్ అనేది స్వల్పకాలిక ఫ్లూ మాత్రమేనని... అయితే మనిషిని ఎంతో ఒత్తిడికి గురి చేస్తుందని, కొందరు మానసికంగా దెబ్బతింటారని కంగన అన్నారు. కరోనాను తాను జయిస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. తన శరీరంలో వైరస్ ఉందనే విషయం తనకు తెలియదని.. ఇప్పుడు పాజిటివ్ అని తేలిందని, దాన్ని ఎదుర్కొంటానని చెప్పారు. కరోనా సోకిన వారు దాని గురించి ఎక్కువగా భయపడకూడదని... భయపడేవారిని అది మరింత భయపెడుతుందని అన్నారు. మరోవైపు తాను యోగా చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు.
Kangana Ranaut
Corona Positive
Bollywood

More Telugu News