మే 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం... కేంద్రం కీలక నిర్ణయం
- కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం
- దివ్యాంగులు, గర్భవతులైన ఉద్యోగులకు వెసులుబాటు
- తాజాగా ఉత్తర్వులు జారీ
- మే 31 వరకు అమలు
అంతకుముందు, ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన కేంద్రం... తాజా ప్రకటన ద్వారా ఆ సదుపాయాన్ని మరింతమందికి అందించింది. ఈ ఉత్తర్వులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు వర్తిస్తాయి. గ్రూప్-ఏ ఉద్యోగులకు పనిగంటలు తగ్గించారు. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగులు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.