గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని తెలిపిన స్టాలిన్‌

 DMK President MK Stalin meets Tamil Nadu Governor
  • త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో గెలిచిన డీఎంకే
  • స్టాలిన్ తో పాటు వెళ్లిన టీఆర్ బాలు, దురై మురుగ‌న్ 
  • ప్ర‌మాణ స్వీకార తేదీని గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యిస్తార‌న్న డీఎంకే నేత
త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 7న స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రి లాల్ పురోహిత్‌ను స్టాలిన్, టీఆర్ బాలు, దురై మురుగ‌న్ క‌లిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ విజ్ఞాప‌న ప‌త్రం ఇచ్చారు. ఈ విష‌యంపై డీఎంకే నేత ఆర్ఎస్ భార‌తి మీడియాతో మాట్లాడుతూ... స్టాలిన్, బాలు, దురై మురుగ‌న్ క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి తీర్మానాన్ని స‌మ‌ర్పించార‌ని, ప్ర‌మాణ స్వీకారోత్స‌వ తేదీని గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు.
Go Back to Shorts
dmk
stalin
Tamilnadu

More Telugu News