మాస్క్ ధరించకుంటే రూ. 200 వరకు జరిమానా: ఏపీలో గ్రామ పంచాయతీల తీర్మానం
- వీధుల్లోకి వచ్చినా, మరో గ్రామానికి వెళ్లినా మాస్క్ తప్పనిసరి
- శుభకార్యాలకు పరిమితికి మించి అనుమతి నిరాకరణ
- మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 50 నుంచి రూ. 200 వరకు జరిమానా వసూలు చేస్తారు. అలాగే, ఇతర గ్రామాల వారు మాస్కు పెట్టుకోకుండా వస్తే అనుమతించరు. పెళ్లిళ్లు, పేరంటాలకు పరిమితికి మించి అనుమతించకూడదని ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అమలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేసింది.