Uttar Pradesh: యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ!

BJP Defeted in UP Panchayat polls in Ayodhya
  • అయోధ్యలో ఓడిపోయిన బీజేపీ
  • మధురలో సమాజ్ వాదీతో టగ్ ఆఫ్ వార్
  • పలు చోట్ల గెలిచిన బీఎస్పీ అభ్యర్థులు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య, మధుర తదితర పురపాలక సంఘాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమిపాలైంది. మొత్తం 40 సీట్లున్న అయోధ్యలో బీజేపీ కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ 24 స్థానాలను గెలుచుకోగా, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఐదు సీట్లను గెలుచుకుంది. వచ్చేఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ద్వారా రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు ఇది ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక మధుర విషయానికి వస్తే, మొత్తం 33 సీట్లలో ఎనిమిది మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ 13 స్థానాల్లో విజయం సాధించగా, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. మిగతా పది స్థానాల్లో గెలుపు ఖరారు కావాల్సి వుంది. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరక్ పూర్ లో (మొత్తం స్థానాలు 68) బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ చెరో 22 గెలుచుకోగా, 23 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నిషాద్ పార్టీలు తలా ఒక సీటును గెలుచుకున్నాయి. కాగా, ప్రయాగ్ రాజ్, వారణాసి తదితర ప్రాంతాల ఫలితాలు వెల్లడికావాల్సి వుంది.
Uttar Pradesh
Local Body Polls
BJP
Samajwadi

More Telugu News