సీఎం పదవికి రాజీనామా చేసిన పినరయి విజయన్
- అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయన్
- కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా రాజీనామా
- ప్రభుత్వం ఏర్పడేంత వరకు సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్
నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. గత నాలుగు దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో ఓకే వ్యక్తికి వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితి లేదు. ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టిన కేరళ ప్రజలు... విజయన్ కు వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు.