కొవిడ్ విధుల్లోకి ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు!
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
- మెడికల్, నర్సింగ్ కోర్సులు చేసిన వారికీ పిలుపు
- ఈరోజు జరిపిన సమీక్షలో మోదీ చర్చ
- కొవిడ్ విధుల్లో చేరిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు
- ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం
- రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం
విద్యార్థులు సహా మెడికల్, నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారినీ కొవిడ్ విధుల్లో చేరాలని పిలుపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ సమీక్ష జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.