Kamal Haasan: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ ఓటమి

Kamal Haasan lost in Coiambatore south assembly constituency
  • ఎంఎన్ఎం అధినేతకు పరాజయం
  • కమల్ పై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం
  • కమల్ కు నిరాశ కలిగించే ఫలితం
  • కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఓటమి

తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కన్న కమల్ హాసన్ కు నిరాశే మిగిలింది. కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కొన్ని రౌండ్ల పాటు కమల్ ఆధిక్యం కొనసాగింది. అయితే చివరి రౌండ్లలో అనూహ్యరీతిలో వనతి శ్రీనివాసన్ పుంజుకున్నారు. చివరికి కమల్ హాసన్ పై చిరస్మరణీయ విజయం సాధించారు. వనతి ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా విభాగం చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఓటమి చెందారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన శ్రీధరన్ పాలక్కాడ్ నియోజవర్గంలో పరాజయం పాలయ్యారు. 88 ఏళ్ల శ్రీధరన్ పై కాంగ్రెస్ కు చెందిన షఫీ పరంబిల్ 3,859 ఓట్లతో నెగ్గారు. అటు, సీఎం పినరయి విజయన్ ధర్మదాం నియోజవకర్గం నుంచి విజయం అందుకున్నారు.

  • Loading...

More Telugu News