Kajal Agarwal: ఇంట్లో అల్లికలు, కుట్లతో సమ‌యాన్ని గడుపుతున్న హీరోయిన్ కాజ‌ల్.. ఫొటో ఇదిగో

kajal shares interesting pic
  • ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కాజల్
  • ఇంట్లో ఉంటూ వాటితో కాల‌క్షేపం
  • ఒత్తిడి నుంచి బయటపడొచ్చ‌ని వ్యాఖ్య
క‌రోనా ఉద్ధృతి ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాను ఇంట్లో ఉంటూ ఎలా కాల‌క్షేపం చేస్తున్నాన‌న్న విష‌యంపై ఇన్‌స్టాగ్రామ్‌లో వివ‌రాలు తెలిపింది.
          
ఒత్తిడి నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లికలు, కుట్లతో  సమ‌యాన్ని గడుపుతున్న‌ట్లు తెలిపింది. మ‌న‌ చుట్టూ ప‌రిస్థితులు బాగోలేన‌ప్పుడు పాజిటివిటీ పెంచుకునేందుకు ఇలాంటి ప‌నులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పింది. మనసుకు నచ్చిన పని చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చునని తెలిపింది. త‌న‌ అల్లిక‌ల ప్ర‌తిభ‌ను చూపెడుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది  ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆచార్య సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.


Kajal Agarwal
Tollywood
Corona Virus

More Telugu News