Rehman: వైసీపీ నేత రెహమాన్ కన్నుమూత... తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్

YCP senior leader Rehman dies of heart attack
  • వైసీపీలో వరుస మరణాలు
  • నిన్న కుడిపూడి చిట్టబ్బాయి మృతి
  • నేడు రెహమాన్ గుండెపోటుతో కన్నుమూత
  • పార్టీ వర్గాల్లో విషాదం 
  • రెహమాన్ మృతి పార్టీకి తీరని లోటన్న సీఎం జగన్

వైసీపీ నేతల వరుస మరణాలు పార్టీ వర్గాల్లో మరింత విషాదం కలిగించాయి. నిన్న మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి మరణించగా, నేడు పార్టీ సీనియర్ నేత, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్ ఈ మధ్యాహ్నం మృతి చెందడంతో పార్టీ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.

రెహమాన్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెహమాన్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎనలేని సేవలు అందించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. రెహమాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెహమాన్ గతంలో ఎమ్మెల్సీగానూ పనిచేశారు. వైసీపీ స్థాపన నాటి నుంచి జగన్ తోనే ఉన్న రెహమాన్ కు వైఎస్ ఫ్యామిలీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది.

  • Loading...

More Telugu News