తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన శ్రీశ్రీ కవిత్వం ఆలోచనాత్మకం: వెంకయ్యనాయుడు
- మహాకవిగా పేరుగాంచిన శ్రీశ్రీ
- నేడు శ్రీశ్రీ జయంతి
- స్పందించిన భారత ఉపరాష్ట్రపతి
- సాహిత్యాన్ని శ్రీశ్రీ కొత్త పుంతలు తొక్కించారని వ్యాఖ్యలు
- తెలుగు కవితను సామాన్యుడికి చేరువ చేశారని కితాబు
- శ్రీశ్రీ ఆలోచనలను యువత అర్థం చేసుకోవాలని పిలుపు
సంప్రదాయ కవితా విధానాన్ని తోసిరాజని శ్రీశ్రీ... కార్మిక, కర్షక, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల బతుకులనే కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజంలో ఆలోచన రేకెత్తించారని వెంకయ్య వెల్లడించారు. శ్రీశ్రీ ఆలోచనల్లోని అంతరార్ధాన్ని గ్రహించి నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని పిలుపునిచ్చారు.