తెలంగాణలో నేటితో ముగియనున్న కర్ఫ్యూ.. మరికొన్ని రోజులు పొడిగించే యోచనలో ప్రభుత్వం
- ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
- తగ్గుముఖం పట్టని కేసులు
- పొడిగింపుపై నేడు ప్రకటన!
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ పొడిగింపుపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది.